|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 11:58 AM
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రజలను దోచుకునేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ అక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ఒక్క రూపాయి ఎక్కువగా వసూలు చేసినా సహించేది లేదన్నారు.
Latest News