|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 12:01 PM
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని T20 ప్రపంచ కప్ విజేతలైన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు దర్శించుకుంది. తొలి T20 ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందేందుకు జట్టు సభ్యులు తిరుమలకు విచ్చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం జట్టు సభ్యులు తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. దేశానికి ప్రపంచ కప్ అందించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని, ఈ విజయం వెనుక జట్టు కృషి, క్రమశిక్షణతో పాటు దేశ ప్రజల ఆశీర్వాదాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు నుంచి తమకు ఎంతో స్ఫూర్తి లభించిందని మహిళా టీ20 కప్ విజేతలు తెలిపారు. వారి ఆటతీరు, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమే తమకు ప్రపంచ కప్ సాధించేందుకు ప్రేరణగా నిలిచిందని తెలిపారు. అంధుల క్రికెట్ జట్టుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, లక్ష్యంపై నిలకడగా దృష్టి పెట్టడంతో ఈ గొప్ప విజయం సాధ్యమైందని ఈ సందర్భంగా జట్టు సభ్యులు తెలిపారు.
Latest News