|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 11:51 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక, బాధ్యులపై చర్యలు, రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వ్యూహాలపై చర్చించనున్నారు. ఈనెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి,ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్న 2026-27 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ రూపకల్పన, ఎన్నికల హామీలైన ‘సూపర్ సిక్స్’ పథకాలకు నిధుల కేటాయింపు, మరియు శాఖల వారీగా ప్రాధాన్యతలపై ఈ భేటీలో ముసాయిదాను సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Latest News