|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 11:02 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో శుభవార్త అందించనుంది. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలను కూడా సేకరిస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. 99 వేల ఉద్యోగాల భర్తీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News