|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 11:00 AM
భవిష్యత్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు టెక్నాలజీ ఆధారిత యుద్ధ నైపుణ్యాలను పెంచుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఢిల్లీలోని మానెక్‌షా కేంద్రంలో మూడు వారాల పాటు యుద్ధ కోర్సు ప్రారంభమైంది. యుద్ధ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, మూడు దళాల మధ్య సమన్వయం, స్వదేశీ ఆయుధాల ఉత్పత్తి, ఆపరేషన్ సింధూర్ సమయంలో వినియోగించిన డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలపై ఈ స్టడీ జరుగుతోంది. రక్షణ పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్‌తో పాటు త్రివిధ దళాలకు చెందిన వ్యక్తులు ఈ కోర్సులో పాలుపంచుకుంటున్నారు. త్రివిధ దళాల్లోని మేజర్ ర్యాంకు నుంచి మేజర్ జనరల్స్, జూనియర్ ఆఫీసర్లు తమ టెక్నాలజీ నైపుణ్యాన్ని షేర్ చేసుకోనున్నారు. ఆపరేషనల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు వ్యవూహాత్మక పరిజ్ఞానాన్ని సీనియర్ ఆఫీసర్లు పంచుకోనున్నారు. మిలిటరీ ఆపరేషన్స్‌లో జరిగే డొమెయిన్ స్పెసిఫిక్ వార్‌ఫేర్ గురించి కోర్సులో నేర్చుకోనున్నారు. వార్‌ఫేర్ కోర్సును నిర్వహించడం ఇది మూడోసారి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి శిక్షణా తరగతుల్ని నిర్వహించడం మొదటి సారి అవుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎక్కువ సంఖ్యలో కొత్త టెక్నాలజీకి చెందిన డ్రోన్లను వినియోగించారు. ఇలాంటి వాటి గురించి తాజా కోర్సులో స్టడీ చేయనున్నారు.
Latest News