|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 11:04 AM
వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.150 నుంచి రూ.167కు, వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్ ప్యాకెట్ రూ.120కు పెరిగింది. వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి రూ.200కు చేరాయి. కొన్ని కంపెనీలు ధర పెంచకుండానే ప్యాకెట్లలో నూనె పరిమాణాన్ని 910 గ్రాముల నుంచి 850, 800 గ్రాములకు తగ్గించాయి. ఈ ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది.
పెరిగిన పప్పుల ధరలు
-కేజీ కంది పప్పు ప్రస్తుతం మార్కెట్లో రూ.130 పలుకుతోంది. గత నెలలో రూ.110కే దొరికింది. మినపప్పు ధరలు రూ.20 మేర పెరిగాయి. వేరుశనగ పలుకులు వారం రోజుల క్రితం కేజీ రూ.140కి లభించగా.. ఇప్పుడు రూ.200 పలుకుతున్నాయి.ఇక ఎండుమిర్చి వారం రోజుల క్రితం కిలో రూ.240కి దొరకగా.. ఇప్పుడు రూ.300కి పెరిగింది.ఇంట్లోకి రోజు అవసరమయ్యే వంటనూనె, పప్పుల ధరలు పెరగడంతో సామాన్యులు షాక్ అవుతున్నాయి.ప్రస్తుతం పండుగల సీన్ లేనప్పటికీ.. ధరలు పెరుగడం గమనార్హం