|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:31 PM
AP: శ్రీశైలంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈసారి భక్తుల రద్దీ సుమారు 50 శాతం పెరిగే అవకాశం ఉందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు ఆనం, అనిత, జనార్దన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎలాంటి రుసుం లేకుండా భక్తుల వాహనాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి సౌకర్యాలు మెరుగుపరచాలని సీఎం సూచించారని ఆనం తెలిపారు.
Latest News