|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:30 PM
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, అశాంతిని రెచ్చగొట్టేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన 'సైకో ముఠా' కుట్రలు పన్నుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఆరోపించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా బూతులు తిట్టడం, కులాలు-మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ సిద్ధాంతమని ఆయన విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి జగన్ ఒక వైరస్‌లా మారారని మండిపడ్డారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో భారీ కుంభకోణం జరిగిందని అనగాని సంచలన ఆరోపణలు చేశారు. చుక్క పాలు కూడా వాడకుండా, జంతువుల కొవ్వుతో తయారు చేసిన 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వినియోగించారని తెలిపారు. ఇదే విషయాన్ని సెట్ నివేదిక స్పష్టం చేసిందని, కానీ వైసీపీ నేతలు రిపోర్టులను తారుమారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దొరికిపోయిన దొంగ భూమన కరుణాకర్ రెడ్డి అని, ఇప్పుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తిరుపతిలో ఫ్లెక్సీలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.
Latest News