|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 02:34 PM
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో గురువారం మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలోని పామెడ్ పీఎస్ పరిధిలో జరుగుతున్న ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల నుంచి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల మృతిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News