|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 02:12 PM
విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య అభిమానులు, పార్టీ నేతలు చివరిసారిగా వీడ్కోలు పలికారు. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగాయి. తమ నేతను కడసారి చూడటానికి భారీ ఎత్తున ఎన్సీపీ శ్రేణులు, మద్దతుదారులు, అభిమానులు .పవార్ పెద్దకుమారుడు అంత్యక్రియలను నిర్వహించారు. అంతకముందు.. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నబిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ శ్రద్ధాంజలి ఘటించారు. తమ అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రతిష్ఠాన్ మైదానానికి ప్రజలు పోటెత్తడంతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ప్రభుత్వ లాంఛనాల నడుమ తండ్రి చితికి ఆయన కుమారుడు నిప్పంటించారు. అజిత్ పవార్‌కు తుది వీడ్కోలు పలుకుతూ ఆయన భార్య సునేత్ర, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు
Latest News