|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 02:00 PM
రిటైర్మెంట్ తర్వాత వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను రాయితీలు పెంచాలని సీనియర్ సిటిజన్లు, స్మాల్ సేవర్స్ కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న మినహాయింపులు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేవని, వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాలకు వడ్డీ ఆదాయం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 1న రానున్న బడ్జెట్ 2026లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. సేవింగ్స్ అకౌంట్లపై మినహాయింపును రూ.10 వేల నుంచి రూ.20 వేలకు, సీనియర్ సిటిజన్లకు FD వడ్డీపై మినహాయింపును రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు., సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీపై మినహాయింపును 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని సూచిస్తున్నారు. దీని వల్ల పెద్ద పెట్టుబడిదారులకు లాభం కాదు. రోజువారీ ఖర్చుల కోసం వడ్డీపై ఆధారపడే రిటైర్డ్ వర్గానికి మాత్రమే ఊరట. ఇంకో ముఖ్యమైన వర్గం ఉంది. సీనియర్ సిటిజన్లు కాకపోయినా, చాలా మధ్యతరగతి కుటుంబాలు ఫిక్స్‌డ్ డిపాజిట్లనే భద్రతగా చూస్తాయి. కానీ ఈ వర్గానికి FD వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపూ లేదు. రిస్క్ తీసుకోలేని స్మాల్ సేవర్స్‌కు కనీస స్థాయి డిడక్షన్ ఇచ్చినా, అది పెద్ద భారం కాకుండా ప్రభుత్వానికి కూడా, ఊరటగా ప్రజలకు కూడా మారుతుందని నిపుణుల అభిప్రాయం.
ఇటు కొత్త ట్యాక్స్ విధానం విషయానికి వస్తే, అది సింపుల్‌గా ఉన్నా సీనియర్ సిటిజన్లకు పెద్దగా ఉపయోగపడటం లేదు. ఎక్కువమంది రిటైర్డ్ వ్యక్తులు కష్టంగా ఉండే ట్యాక్స్ ప్లానింగ్ చేయరు. వడ్డీ ఆదాయమే వారి ప్రధాన ఆధారం. అలాంటి వారికి కొత్త విధానంలో కూడా చిన్న మినహాయింపు ఇస్తే, ఆ విధానం మరింత న్యాయంగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక బడ్జెట్ 2026 ముందు చర్చలో ఉన్న అసలు ప్రశ్న ఇదే.
Latest News