|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 02:37 PM
విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె అలరించాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా సరే, 23 బంతుల్లో 65 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. మ్యాచ్ అనంతరం దూబె మాట్లాడుతూ.. "నా ఆట మెరుగవడానికి కారణం హార్డ్ వర్క్. కఠిన పరిస్థితుల్లో ఆడటం వల్ల బౌలర్ల వ్యూహాలు అర్థమవుతున్నాయి" బౌలర్ల వ్యూహాలను పసిగట్టగలిగానని అన్నాడు. నా మైండ్‌సెట్‌తోనే నా ఆట మెరుగవుతోంది. కఠిన పరిస్థితుల్లో ఆడటం అలవాటవుతోంది. దీంతో బౌలర్ల వ్యూహాలను ముందుగానే పసిగట్టగలుగుతున్నాను. వారు నాకు ఎలాంటి బంతులు సంధించబోతున్నారో ఊహించగలుగుతున్నాను’ అని శివమ్ దూబె అన్నాడు. అలాగే ఇష్ సోధీ బౌలింగ్ గురించి కూడా అతడు మాట్లాడాడు. ‘స్పిన్నర్ల బౌలింగ్‌లో పెద్ద షాట్లు కొట్టడం కష్టం. ఇష్ సోధీ చక్కగా బౌలింగ్ వేశాడు. అతడు కొన్ని చెడ్డ బంతులేస్తాడని నాకు తెలుసు. వాటి కోసమే ఎదురుచూశాను. ఆ సమయంలో నేను డామినేట్ చేద్దామనుకున్నా’ అని శివమ్ దూబె పేర్కొన్నాడు. అని తెలిపాడు.
Latest News