|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:44 AM
అధికార అహంకారంతో కూటమి ఎమ్మెల్యేలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అయినా, అదే ప్రభుత్వం నేరస్తులను రక్షించడం దుర్మార్గమని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అవమానాలు ప్రజాస్వామ్యానికి మచ్చలాంటివని అన్నారు. న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మహిళలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Latest News