|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:44 AM
సమిష్టి కృషితో పార్టీ మరింత బలోపేతం చేద్దామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. పి. గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, పార్టీ గౌరవ అధ్యక్షులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంస్థాగతంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యకర్త, నాయకుడు సమన్వయంతో పనిచేసినప్పుడే పార్టీ బలపడుతుందని స్పష్టం చేశారు.బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలపరచాలని, ప్రజలతో నిరంతరం అనుసంధానంగా ఉండాలని ఆయన సూచించారు. వైయస్ జగన్ గారి నాయకత్వం, సంక్షేమ పాలనను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, కారుమూరి సునీల్, నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాస్ రావు, నేలపూడి స్టాలిన్ బాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరదేవి, పి.కె. రావు గారు పాల్గొన్నారు.
Latest News