|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:43 AM
విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబం భూదోపిడీకి పాల్పడుతోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ...54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యాసంస్థలకు ఈ భూమని అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్దమైన ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిసి విశాఖ జీవీఎంసీ కమిషనర్, మేయర్ లకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే... రాజకీయ పార్టీలు, మేధావులతో కలిసి పోరాడుతామని తేల్చి చెప్పారు. మరోవైపు కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న బీజేపీ నేతలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Latest News