|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:41 AM
కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే రాసలీలలు, మహిళలపై జరుగుతున్న అవమానకర చర్యలకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరి లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఆర్.కె. రోజా నేతృత్వం వహించగా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నగరి ఏ.జె.ఎస్. కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు నిర్వహించిన ర్యాలీలో కీచక ఎమ్మెల్యేలను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్.కె. రోజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించేలా ప్రవర్తించిన కీచక ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
Latest News