|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:40 AM
కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ గీతం యూనివర్సిటీకి ఐదువేల కోట్ల భూములు అప్పనంగా కట్టబెడుతోంది అని విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయన మాట్లాడుతూ... ఈ భూ కేటాయింపు అన్యాయం. విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం విద్యాసంస్థల ఆక్రమణలో ఉన్న భూమిని వారికి రెగ్యులరైజ్ చేయడం అప్రజాస్వామికం. కూటమి ప్రభుత్వం విశాఖలో భూములను పప్పు బెల్లాల్లా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండళ్లలోనే దాదాపు రూ.30 వేల కోట్ల భూములను తమకు నచ్చిన వారికి కట్టబెట్టింది. జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో గీతం యూనివర్సిటీకి 54.79 ఎకరాలను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జీవీఎంసీ కమిషనర్ కి వినతిపత్రం సమర్పించాం. విశాఖలో జరుగుతున్న భూదోపిడిపై మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. దీనిపై పోరాటం చేస్తాం అని హెచ్చరించారు.
Latest News