|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:39 AM
రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాయ చేస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం అనంతపురంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు పొంతన లేదని మండిపడ్డారు. “అప్పుడు పంది అన్నది ఈరోజు నంది అయింది… అప్పుడు నంది అన్నది ఈరోజు పంది అవుతోంది” అంటూ చంద్రబాబును తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర ప్రజల చెవుల్లో చంద్రబాబు పూలు పెడుతూ, అబద్ధపు ప్రచారాలతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు రూ.14 లక్షల కోట్ల దోపిడీకి తెరలేపారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే ఎకరాకు 2,800 గజాలు, ఒక్కో గజం లక్ష రూపాయల విలువ ఉంటే, ఎకరానికి రూ.28 కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు. అలా చూస్తే 50 వేల ఎకరాలకు రూ.14 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు.కానీ ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేసి, 28 గ్రామాల్లోని కొందరు భూస్వాములు, చంద్రబాబు బంధువులు, అనుచరులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా వ్యవస్థను రూపొందించారని ఆరోపించారు. ఈ ల్యాండ్ పూలింగ్ కారణంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ.14 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు.
Latest News