|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 12:43 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హోం మంత్రి అనితకి కౌంటర్ ఇచ్చారు. “బెంగుళూరు అంకుల్” అంటూ హోం మంత్రి అనిత చేసిన జూగుప్సకరమైన వ్యాఖ్యలు చూస్తే, కూటమి ప్రభుత్వానికి ఉన్న రాజకీయ భావ దారిద్ర్యం ఏంటో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సైద్ధాంతిక వాదనలు, విధాన పరమైన చర్చలు పక్కనపెట్టి వికృతమైన రాజకీయ వ్యాఖ్యలకు దిగజారడం ద్వారా హోం మంత్రి స్థాయి రోజురోజుకీ పడిపోతోందని తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. విధానాలపై వాదనలు చేయాల్సిన స్థాయిలో ఉండి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం కూటమి పాలన దిశారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. దళిత మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వాలన్నది వైయస్ జగన్ గారి రాజకీయ దార్శనికతలో భాగమని, ఆ విధానాన్ని మార్చలేకనే చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా అనిత గారికి పదవి ఇచ్చారని తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ నిజాన్ని హోం మంత్రి ముందుగా అర్థం చేసుకోవాలని సూచించారు.
Latest News