|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:18 PM
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి, ఏఐ, అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దొంగతనాలను అరికట్టేందుకు రెండు దశల్లో సంస్కరణలు చేపట్టాలని, తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపులో భద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని, కానుకలను వర్గీకరించడంతో పాటు విదేశీ కరెన్సీని గుర్తించేందుకు ఏఐని ఉపయోగించాలని, 8 వారాల్లోపు ముసాయిదా రూపొందించి సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
Latest News