|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:55 AM
AP: నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ఆగంతకుడు ఇచ్చిన చాక్లెట్లు తిన్న 11 మంది విద్యార్థినులు, ఒక పీఈటీ టీచర్ అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినుల కనురెప్పలు నల్లబడటం, కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండటంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల నందికొట్కూరులో నిషేధిత మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడులు జరిగిన నేపథ్యంలో, ఈ చాక్లెట్లు ఆ కేంద్రానికి చెందినవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News