|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:56 AM
ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పంజాబ్ నుంచి బీహార్ వరకు ఆకాశం విషపూరితంగా మారింది. శుక్రవారం ఉదయం పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో భారతీయ వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్డు, రైలు, ఆకాశ మార్గాల్లో ప్రయాణాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలపై దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
Latest News