|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:28 AM
మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల బాధ్యత అని స్పష్టం చేసింది. వివాహం చేసుకున్నా, లేకపోయినా ప్రతి పౌరుడికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని తెలిపింది. మేజర్ల నిర్ణయాల్లో కుటుంబ సభ్యులు, ఇతరులు జోక్యం చేయరాదని, వారి ప్రశాంత జీవితానికి భంగం కలిగించకూడదని ఆదేశించింది. భవిష్యత్తులో ముప్పు ఎదురైతే పోలీసులు వెంటనే స్పందించాలని సూచించింది.
Latest News