|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:38 AM
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోల్‌కతా సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఓ వ్యక్తిపై గురువారం ఆయన ఫిర్యాదు చేశాడు. అర్జెంటినా ఫుట్‌బాల్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ సాహా అనే వ్యక్తి తనపై నిరాధారమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అయిన లాల్‌బజార్‌కు గంగూలీ ఈ-మెయిల్ ద్వారా ఈ ఫిర్యాదును పంపాడు. ఉద్దేశపూర్వకంగానే సదరు వ్యక్తి తనపై తప్పుడు, హానికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు. దశాబ్దాల పాటు క్రీడాకారుడిగా, క్రీడా నిర్వాహకుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తాను సంపాదించుకున్న కీర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
Latest News