|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:39 AM
ప్రముఖ నాస్కార్ రేసింగ్ డ్రైవర్, రిటైర్డ్ దిగ్గజం గ్రెగ్ బిఫిల్ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఏడుగురు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. నార్త్ కరోలినాలోని స్టేట్స్‌విల్ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఉదయం 10:15 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఫ్లోరిడాకు బయలుదేరిన సెస్నా సి550 బిజినెస్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు రావడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ల్యాండింగ్ అవుతుండగా విమానం కుప్పకూలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గ్రెగ్ బిఫిల్, ఆయన భార్య క్రిస్టినా, వారి కుమారుడు రైడర్, కుమార్తె ఎమ్మా మరణించినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. మరో ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో మరణించినట్లు వారు తెలిపారు. ప్రమాదం తర్వాత మంటలు తీవ్రంగా ఉండటంతో మృతదేహాల అధికారిక గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు పేర్కొన్నారు.వచ్చే వారం తన 56వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా బిఫిల్ మరణించడం అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది.
Latest News