|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:38 AM
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉద్యమంలో భాగంగా తలపెట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, ముందుకొచ్చి సంతకాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబర్‌తో సహా, పూర్తి వివరాలు తెలిపారు. కోటి సంతకాల పత్రాలను తొలుత ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రెండుసార్లు ప్రదర్శించిన అనంతరం ఈనెల 15న జిల్లా కేంద్రాలకు తరలించి, ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఆ పత్రాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, కోటి సంతకాలపై మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్, గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ శ్రీ అబ్ధుల్‌నజీర్‌ను కలిసి నివేదించారు. కోటి సంతకాలు పత్రాలను కూడా గవర్నర్‌కు చూపడం కోసం వాటిని 26 వాహనాల్లో లోక్‌భవన్ తరలించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ వాహనాలకు జెండా ఊపి లోక్‌భవన్‌కు వెళ్లే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షుడు, రీజినల్ కో–ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో శ్రీ వైయస్ జగన్ సమావేశమయ్యారు.
Latest News