|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:44 PM
బేతంచెర్ల మండలం ఆర్. ఎస్. రంగాపురం గ్రామ శివారులోని శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరై, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, VIPల కంటే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Latest News