|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:26 PM
AP: నంద్యాల జిల్లాలోని నందమూరి నగర్‌లో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. చాకలి గురప్ప (26) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అల్లుడితో కలిసి గొంతుకు తాడు బిగించి భార్య సుభద్ర భర్తను చంపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలను సృష్టించింది.
Latest News