|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:30 PM
పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విడాకుల కోసం మొదటి మోషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం పాటు విడిగా జీవించాలనే షరతు తప్పనిసరి కాదని, ఈ కాలాన్ని కోర్టు మాఫీ చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే, ఆరు నెలల కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ను కూడా స్వతంత్రంగా మాఫీ చేయవచ్చని పేర్కొంది. విడిపోవాలని నిశ్చయించుకున్న దంపతులను బలవంతంగా వివాహ బంధంలో ఉంచడం కోర్టు ధర్మం కాదని, ఇది వారి ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.
Latest News