|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:17 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం.ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం. అదే సమయంలో, రాష్ట్రంలో కొత్తగా చేపట్టాలనుకుంటున్న నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, కేంద్ర జల సంఘం అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టుల ఆవశ్యకతపై ఆయనతో చర్చించనున్నారు.
Latest News