|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:16 PM
సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ప్రముఖ వాణిజ్య పత్రిక 'ది ఎకనమిక్ టైమ్స్' ఆయన్ను 'బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో సత్కరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.ఈ అవార్డు రావడంపై లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. "ఇది మా కుటుంబానికే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు కూడా గర్వకారణమైన క్షణం. భారత సంస్కరణల ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు నడిపించిన నాయకులు కొందరే ఉంటారు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్కరణలు, పాలనా వేగంపై ఉన్న నమ్మకానికి ఈ అవార్డు ఒక నిదర్శనమని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Latest News