|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:14 PM
జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా పలు జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ‘ఛాంపియన్ రైతు’ అనే కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక ఛాంపియన్ రైతును ఎంపిక చేసి, వారి ద్వారా యాంత్రీకరణ, ఎరువులు-పురుగుమందుల వాడకం తగ్గింపు, ప్రత్యామ్నాయ పంటలు, ప్రకృతి సేద్యం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంపై సీఎం స్పందిస్తూ, "ఈ ఇనిషియేటివ్ చాలా బాగుంది. అన్ని శాఖలను సమన్వయం చేసి రైతులకు మేలు చేసేలా కలెక్టర్ హిమాన్షు శుక్లా చక్కగా పనిచేస్తున్నారు" అని ప్రశంసించారు. ఛాంపియన్ రైతులను స్వయం సహాయక సంఘాలుగా లేదా ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దాలని సూచించారు.
Latest News