|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:09 PM
జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా పలు జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌లో ఏఐ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తున్నామని కలెక్టర్ ఆనంద్ వివరించారు. రికార్డుల తారుమారుకు అవకాశం లేకుండా ఒక ఆన్‌లైన్ లైబ్రరీని సిద్ధం చేశామన్నారు. దీనిపై సీఎం హర్షం వ్యక్తం చేస్తూ, అన్ని భూ రికార్డులను క్లౌడ్‌లో భద్రపరచాలని, దీనివల్ల మానిప్యులేషన్‌కు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ మూడు ప్రాజెక్టులు జిల్లాల్లో ‘గేమ్ ఛేంజర్లు’గా మారతాయని, క్షేత్రస్థాయి నుంచి ఇలాంటి ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు.
Latest News