దేశానికే ఆదర్శం కడప ‘స్మార్ట్ కిచెన్’ ప్రాజెక్టు
 

by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:08 PM

జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా పలు జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సీఎం చంద్ర‌బాబుకు వివరించారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో పాఠశాల విద్యార్థులకు వేడిగా, రుచిగా పౌష్టికాహారం అందించేందుకు ‘స్మార్ట్ కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్’ ప్రాజెక్టు చేపట్టామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ప్రతి మండలానికి ఒక స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి, పాఠశాలలకు భోజనం అందిస్తున్నామని చెప్పారు. దీని కోసం సౌర విద్యుత్, బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రశంసించిన సీఎం, ఇది దేశానికే మోడల్‌గా నిలుస్తుందన్నారు. "స్మార్ట్ కిచెన్... స్మార్ట్ హెల్త్... స్మార్ట్ చిల్డ్రన్ అనేలా దీన్ని తీర్చిదిద్దాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు కడప స్మార్ట్ కిచెన్లను సందర్శించాలి" అని ఆదేశించారు. మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ఈ విధానాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించగా ఆయన కూడా అభినందించారని తెలిపారు.

Latest News
3rd Test: WI make strong start after Conway's double ton powers NZ to 575/8 dec Fri, Dec 19, 2025, 03:06 PM
Pushpangadan, 'Jeevani' pioneer who ensured tribal share in science, passes away Fri, Dec 19, 2025, 03:02 PM
93 Indian airports switch to 100 pc green energy use: Minister Fri, Dec 19, 2025, 03:00 PM
Indian scientists find missing link in body's cells to boost therapies for Alzheimer's, cancer Fri, Dec 19, 2025, 02:57 PM
Indian study shows how freshwater sponge-associated microbes can tackle metal pollution Fri, Dec 19, 2025, 02:53 PM