|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:11 PM
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి హాని జరిగినా సంబంధిత అధికారులను ముందుగా సస్పెండ్ చేసి, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. అమరావతిలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.జిల్లా కలెక్టర్లు స్వయంగా సంక్షేమ హాస్టళ్లలో నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. విద్యార్థుల బాగోగులు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని, వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించాలన్నారు. 7 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి ప్రవేశపెట్టాలని, పాఠశాలల్లో క్రీడలను తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు.
Latest News