|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:01 PM
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం రామ్మోహన్ నాయుడు విస్తృతంగా కృషి చేస్తున్నారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ప్రధాని ఒక పోస్ట్ చేశారు. "కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఒక యువ నాయకుడు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు.
Latest News