|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:03 PM
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఈ తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.వివరాల్లోకి వెళితే.. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాలు అడవిని జల్లెడ పడుతుండగా, మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించారు.ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆపరేషన్ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Latest News