|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:57 PM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో కొత్తగా మరో కేసు నమోదైంది. గత ఏడాది జులై నెలలో తనపై వంశీ, ఆయన అనుచరులు దాడి చేశారంటూ సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.బాధితుడు సునీల్ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ, ఆయనతో పాటు మరో ఎనిమిది మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
Latest News