|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:15 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అయన మాట్లాడుతూ... జగన్‌గారు సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, 7 కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై ప్రజలు మండి పడుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందన్న వైయస్ఆర్‌సీపీ వాదనను ప్రజలు అర్థం చేసుకున్నారు. గత మా ప్రభుత్వం నిర్మించిన కాలేజీలు, ఆస్పత్రులతోపాటు ఆయా ఆస్పత్రుల పరిధిలో ఉన్న వందల కోట్ల విలువ చేసే భూములను కాజేయాలన్న కుట్రతోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఒకవైపు ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్ల అప్పు చేయడమే కాక, మెడికల్ కాలేజీల రూపంలో జగన్‌గారు సృష్టించిన వేల కోట్ల విలువైన సంపదను ప్రైవేటుకి అప్పనంగా ధారాదత్తం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఆయా కాలేజీల్లో పనిచేసే స్టాఫ్‌కి రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో ప్రజా సంపదను దోచిపెడుతున్నాడు. కుడి చేతితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి రాసిచ్చి, జీతాల రూపంలో ఒక్కో ఏడాది ఇచ్చే దాదాపు రూ. 800 కోట్ల సొమ్మును ఎడమ చేత్తో వారి నుంచి లాక్కుంటున్నాడు. తన దోపిడీ కుట్రలను యథేచ్ఛగా అమలు చేయడానికి నిస్సిగ్గుగా పార్లమెంట్ స్థాయీ సంఘం నివేదికను కూడా వక్రీకరించేస్తున్నాడు. కిక్ బ్యాక్‌ల కోసం తాను ఎంతకైనా దిగజారుతానని చెప్పకనే చెబుతున్నాడు అని తెలిపారు.
Latest News