|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:13 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రజల నుంచి పుట్టిన ఉద్యమమని పార్టీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం వెనుక ప్రజల ఆవేదన, పేదల భవిష్యత్తుపై ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని, ఆ దిశను పూర్తిగా మార్చి ప్రైవేటీకరణకు దారి తీస్తున్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు విమర్శించారు. “కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి తమ గళాన్ని వినిపించారు. ఇది సాధారణ నిరసన కాదు… ప్రజల సంకల్పం. ఈ ప్రజా ఉద్యమం ముందు కూటమి ప్రభుత్వ మెడలు వంచక తప్పదు” అని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా స్పందనను గౌరవించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని, ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ తుదివరకు పోరాడుతుందని ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు తేల్చిచెప్పారు.
Latest News