|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:12 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం కోటి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి లోక్ భవన్‌కు పంపించారు. అన్ని జిల్లాల నుంచి తాడేపల్లికి చేరుకున్న కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, కీలక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వాహనాలు ర్యాలీగా విజయవాడలోని లోక్ భవన్‌కు చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం వైయస్ జగన్ కీలక నేతలతో కలిసి లోక్ భవన్‌కు వెళ్లి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గళాన్ని గవర్నర్‌కు వినిపించనున్నారు.
Latest News