|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:09 PM
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రలను రాష్ట్ర యువత, మేథావులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని మాజీ ఎంపీ.గోరంట్ల మాధవ్ తెలిపారు. అయన మాట్లాడుతూ... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కూటమి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించే దర్జాగా దోపిడీకి బాటలు వేసుకుంటున్నాడు. రేపు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై లోతైన విచారణ చేసి నిందితులు ఎవరున్నా వదిలి పెట్టబోము. న్యాయస్థానాల్లో నిలబెట్టి కఠినంగా శిక్షించే వరకు వెనకాడబోము. కేవలం దోపిడీ ఆలోచనలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జగన్‌గారు నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు కాలేజీలను దక్కించుకున్న 10 మెడికల్ కళాశాలల ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇదంతా ప్రజల ఆస్తులను అప్పనంగా తన బినామీలకు దోచిపెట్టే కుట్రే. ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.70 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ. 140 కోట్లు.. రెండేళ్లలో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు దోచిపెట్టే కుట్రకు తెర లేపారు. కుడిచేత్తో కాలేజీలను, కాలేజీ భూములను వారి చేతిలో పెట్టి.. ఎడమ చేత్తో జీతాల పేరుతో ఇచ్చిన రూ.1400 కోట్ల డబ్బును వారి నుంచి తీసుకునే దోపిడికి స్కెచ్ వేశాడు. ఇందుకు రాబోయే రోజుల్లో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు.
Latest News