|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:26 PM
మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆమెకు ఈ చెక్కును అందజేశారు.ఈ నగదు బహుమతితో పాటు విశాఖపట్నంలో 500 గజాల నివాస స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Latest News