|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:25 PM
రాష్ట్ర పాలనలో వేగాన్ని పెంచి, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తరహాలోనే ఈ విధానం ఉంటుందని, ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.అమరావతిలోని సచివాలయంలో ఇవాళ జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారుల పనితీరుకు ఇకపై ఇదే కొలమానం అవుతుందని తెలిపారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను (గ్రీవెన్సులు) త్వరితగతిన పరిష్కరించి, ఆ వివరాలను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించారు.ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయిని పెంచాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం అన్నారు. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, యువత వంటి అన్ని వర్గాలకు మేలు చేయడం ద్వారా ప్రభుత్వానికి సానుకూలత వస్తుందన్నారు. పాలనలో ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, వారి సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.
Latest News