|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:39 PM
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. టెస్టులు, టీ20 ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన ఆయన, ఇప్పుడు మళ్లీ మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఒకేసారి పూర్తిస్థాయి సిరీస్ ఆడి, ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పాలనేది తన ప్రణాళిక అని వెల్లడించాడు. షకీబ్ మాట్లాడుతూ.. "నేను అధికారికంగా ఏ ఫార్మాట్ నుంచీ రిటైర్ కాలేదు. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి వన్డే, టెస్ట్, టీ20లతో కూడిన ఒక పూర్తి సిరీస్ ఆడి, ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పాలనేది నా ప్లాన్. ఏ ఫార్మాట్ ముందు, ఏది తర్వాత అన్నది ముఖ్యం కాదు. కానీ, ఒక పూర్తి సిరీస్ ఆడి వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాను" అని వివరించాడు.
Latest News