|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 01:49 PM
బరువు తగ్గాలనుకునేవారికి బాదం పప్పు ఒక అద్భుతమైన స్నాక్. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో నిండిన బాదం.. కడుపు నిండుగా ఉంచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోజుకు 8-12 బాదం పప్పులు (సుమారు 25 గ్రాములు) తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పచ్చిగా, తేలికగా వేయించి, ఉప్పు లేకుండా, నానబెట్టి, సలాడ్ లేదా ఓట్స్‌లో కలిపి తీసుకోవచ్చు. పిల్లలకు రోజుకు 2-3 బాదం పప్పులు ఇవ్వడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
Latest News