|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 12:09 PM
ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహిస్తే వాటికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక జగన్ బీసీలను అవమానించాడంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాటల సందర్భంలో ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ అనేవాడు అన్న మాటను పట్టుకుని యాదవులను అవమానించడానికి ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ, రజకులను, నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అన్న చంద్రబాబు మాటలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైయస్ జగన్ గారు సీఎంగా ఉండగా ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా సైకో, బోష**, చంపేస్తా, నరికేస్తా అని చంద్రబాబు, లోకేష్, బుచ్చయ్య చౌదరి మాట్లాడిన మాటలు కనిపించలేదా అని దుయ్యబట్టారు. వ్యక్తులను గౌరవించడం వైయస్ జగన్ నుంచే నేర్చుకోవాలని హితవు పలికారు. యాదవులను రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకి అలవాటని, వైయస్ జగన్ సీఎం అయ్యాక యాదవులకు రాజకీయంగా గుర్తింపు దక్కిందని చెప్పారు. విశాఖ, తిరుపతిలో యాదవ కులానికి చెందిన మహిళలను మేయర్లుగా నియమిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యంత అవమానకర రీతిలో తొలగించిందని గుర్తుచేశారు. ఇది యాదవులకు ద్రోహం చేయడం కాదా అని నిలదీశారు. చంద్రబాబు తన జీవిత కాలంలో ఏ ఒక్క బీసీకి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించలేదని.. వైయస్ తొలిసారి ఏపీ చరిత్రలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి బీసీలకు పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా యాదవ కులానికి చెందిన ఇద్దరికి, రాయలసీమలో రమేశ్‌యాదవ్‌కి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరించారు. అలాంటి వ్యక్తిని బీసీ వ్యతిరేకగా ముద్ర వేయాలని చూస్తే ఎవరూ పట్టించుకోరని స్పష్టం చేశారు.
Latest News