|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 12:10 PM
సీఎం చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ విమర్శించారు. శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని చెప్పి ఆయన అభాసుపాలు చేశారని దుయ్యబట్టారు. పరకామణి వ్యవహారాన్ని వైయస్ఆర్‌సీపీపై నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో దేవాలయాలపై జరిగిన దాడులు, నిధుల దుర్వినియోగాలు, భక్తులు ఎదుర్కొన్న నష్టాలను లెక్కపెట్టుకుంటే పేజీలు సరిపోవని పుత్తా శివశంకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Latest News