|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:31 PM
గోవాలోని ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం భారీగా జరగడానికి కారణం క్లబ్ పరిసరాలేనని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. క్లబ్ లోకి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండడంతో పాటు అలంకరణ కోసం క్లబ్ ముందు ఏర్పాటు చేసిన తాటాకుల వల్ల మంటలు వేగంగా విస్తరించాయని చెబుతున్నారు.క్లబ్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. గతంలో క్లబ్ ను పరిశీలించిన అధికారులు.. పరిసరాలను గమనించి ఆ ఏరియాలో క్లబ్ నిర్వహణకు అనుకూలం కాదని, వెంటనే క్లబ్ ను మూసేయాలని నోటీసులు కూడా జారీ చేశారని సమచారం. అయితే, ఈ నోటీసులను లెక్కచేయకుండా క్లబ్ ను నడపడం వల్ల తాజాగా జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ ఇరుకైన మార్గాల కారణంగా మంటలు ఆర్పడంలో ఆలస్యం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Latest News