|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 02:51 PM
భారీ సంస్కరణల్లో భాగంగా కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయడం, పారదర్శకంగా మార్చడం వంటివి తదుపరి అజెండాలో ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయ పన్ను, జీఎస్టీ సంస్కరణల తర్వాత కస్టమ్స్ డ్యూటీ రేట్లను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దీనిపై ప్రకటనలు ఉండొచ్చని, అంతర్జాతీయ వాణిజ్యంలో పోటీతత్వాన్ని పెంచేందుకు కస్టమ్స్ విధానాల ఆధునీకరణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు.
Latest News